Thursday, March 17, 2005

 

నా దేశం by రఘు


ఏమైపోతోంది నా దేశం
ఎటెళ్ళి పోతోంది నాదేశం
కులాల రొచ్చులో, మతాల చిచ్చులో
అవినీతి రొచ్చులో, అజ్నానపు బొచ్చెలో
||ఏమైపోతోంది నా దేశం ||
సుల్తాన్ ప్రభువులు ఆ తెల్ల దొరలు
దోచిందంతా దోచుకుపోగా
శేషం లోనే శ్లేషం వచ్చి
చేతకాని చేవలేని
జవసత్వాలసలేలేని
శుష్క శుంఠ మంత్రుల చేతబడి
||ఏమైపోతోంది నా దేశం ||
అలసత్వం ఆసరాగా అన్నలవలె తోడుంటామని నమ్మబల్కి
తమ్ములనే చండించే మావో హంతకులొకవైపు

ఓటేస్తే ఎదైనా చేస్తామని అంటూనే
గెలిచాక మొహం చాటేసే కుళ్ళు నాయకులొకవైపు

(స్వ)జనం కోసమే పనిచేసే వుద్యోగులు ఒకవైపు
నిస్పృహతో కాలం వెళ్ళబుచ్చే నిరుద్యోగులు మరొకవైపు
||ఏమైపోతోంది నా దేశం ||

ఒక హిట్లరో మరొక శ్రీకృష్ణుడో వచ్చి మారుస్తాడని
ఇంట్లో వెచ్చని పగటి కలలుకనే ఆశావాదులు ఒకవైపు

ఇక ఈ దేశాన్నెవరూ బాగుచేయలేరని
పరదేశాలకు చెక్కేసే అవకాశవాద మేధావులు మరొకవైపు
||ఏమైపోతోంది నా దేశం ||
# posted by MyBlog @ 1:26 AM
Comments:
In the fourth line of "Naa Desam" instead of using kulaala rocchulo, you can use Ucchulo (As u r aware the meaning of ucchu (Vala). Isn't it?
Thank you, They are very nice
 
Post a Comment

<< Home