Thursday, March 17, 2005

 

లోకం - స్వార్ధం by రఘు



చీ చీ పాడులోకం చిరాకు నాకీ లోకం
చిందర వందర ఈలోకం కప్పల తక్కెడ ఈ లోకం

పైనేమో గాంభీర్యాలు, లోనేమో వైషమ్యాలు
అవునంటే సంతోషాలు, కాదంటేనే అపోహలు
క్రూరత్వాలు, జడత్వాలు, కాలకూట విషాలు
తర్కాలు, విభేధాలు
పైగా ఏవేవో తత్వాలు
ఎందుకోసం? ఎవరి కోసం ??
జనం కోసమా ? జాతి కోసమా??
మనీ కోసమా? మన శ్శాంతి కోసమా??

ఏదేశం ఎంత వైశాల్యం ఉంటేనేం?
స్వార్ధం విశ్వమై
హృదయం బిందువైనప్పుడు

ప్రజాస్వామ్యాలు, సామ్యవాదాలు, రాచరికాలు
ప్రాంతాలు, మతాలూ, కులాలూ, కట్టుబాట్లు
ఇవేవీ నిలబడవు
ఇవేవీ నిలబడవు
ఇవేవీ నిలబడవు

కాదని మొండికేసినా
బతకమాలిన వాడిగా జమకట్టి
వికటాట్టహాసం చేస్తూ
ఒంటరిగా మిగులుస్తాయి
# posted by MyBlog @ 1:45 AM
Comments: Post a Comment

<< Home