తలవంచిన వనిత తనువు తీరని తరుణం
కన్నీటి బిందువు వాలు జారిన క్షణం
ఎగసిన భావాలు ఎదురీత పయనం
పరుగుతీయు ఆశయాలు స్థంభించిన సమయం
నిశ్చలమైన తనువు నిబిడీకృతమైన ఆశల
చెరసాల నుండి విడి పంచభూతాలలో మిళితమైన క్షణం
ఏదీ నీ గమ్యం?
ఇదీ నీ వెండి వెలుగుల మృగ్యమం ..
చీకటి చెరశాల నుండి విడిన నీ బంధం
కావాలి ఈ జగత్తుకి తిరుగులేని శాసనం
పంచ భూతాలనుంచి ప్రక్షాళన కోరిన నీ ఆఖరి శ్వాశ
చేయనీ చిత్ర జగత్తుకి ఉవ్వెత్తున ఎగసే బాస
కాలం మారినా, కాయం చేసినా
కలకాలం మిగిలేది ఒక్క కాకులగోల
ఆర్తిగాఎదురు చూసే ఒక్కొక్క కన్నీటి బిందువు నుంచి
జారువాలిన ప్రతి ఒక్క రక్తపు బిందువు కావాలి ఒక శిశిరం
రాకూడదు మరో అశృనయనం ..
# posted by MyBlog @ 12:46 AM