ఊరి వెలుపల
పాడు కోనేరు చెంత
మనుజుల్లెవ్వరు మసలని మారుమూల
గుట్ట చాటున లోతైన గొయ్యి తవ్వి
పసిడి దాచెను పిసినారి ముసలి ఒకడు .
అనుదినంబునా వృద్ధుడారుదెంచి
ముసిరిపడుచుండె బంగారు ముద్ద చూచి
పొదలమాటున అది యెల్ల పొంకి చూచి
దొంగ ఒకడు సర్వంబు దోచుకెల్లె
మరుదినంబునా వృద్ధుడారుదెంచి
గొయ్యి తవ్వంగ బంగారం మాయమయ్యె
నెత్తి నోరు లబ లబ మొత్తుకొనుచు
ఘొల్లుమని ఏడ్చి గగ్గోలు పెట్టె
# posted by MyBlog @ 11:54 AM